National

మహారాష్ట్రలో కొత్త ప్రభుత్వం – కొత్త మంత్రులు

Share with

మహారాష్ట్రలో కొత్త ప్రభుత్వం మంత్రి పదవులకు రంగం సిద్దం చేస్తోంది. కొత్తగా 45 మంది మంత్రులు కొత్త భాద్యతలు తీసుకోబోతున్నారు. బీజేపీకే ఎక్కువ శాఖలు దక్కేలా
ఉన్నాయని వార్తలు వినిపిస్తున్నాయి. బీజేపీ నుండి 25 మంది, షిండే వర్గం నుండి 13 మందికి మంత్రిపదవులు దక్కనున్నాయి. ముఖ్యమంత్రి షిండే, ఉపముఖ్యమంత్రి
దేవేంద్ర ఫడ్నవీస్ తప్ప మిగిలిన శాఖలు కొత్తవారికే దక్కనున్నట్లు సమాచారం. రాబోయే ఎన్నికల కోసం ముందుచూపుతో కొత్తవారి పనితీరును గమనించాలని బీజేపీ
భావిస్తున్నట్లు వార్త. శివసేన పార్టీ నుంచి షిండే, మరికొందరు ఎమ్మెల్యేలు అసమ్మతి తెలియజేయడం వల్ల మహారాష్ట్ర ప్రభుత్వం కూలిపోయి, 10 రోజుల పాటు రాజకీయం
గందరగోళంగా తయారైన విషయం మనకు తెలిసిందే. చివరకు బీజేపీ మద్దతు ఇవ్వడంతో షిండే వర్గం అధికారంలోకి వచ్చింది.