National

వారణాసిలో మహా వంటశాల

Share with

ఉత్తరప్రదేశ్ వారణాసిలో మహా వంటశాలను ఎల్టీ కళాశాలలో ప్రధాని మోదీ ప్రారంభించారు. ఈ వంటశాలలో లక్ష మందికి వంట చేయగల సామర్థం ఉంది.
ప్రారంభోత్సవం అనంతరం ప్రధాని మోదీ మాట్లాడుతూ, ఇలాంటి భారీ కిచెన్‎తో విద్యార్థులకు చాలా ఉపయోగం అన్నారు. బీజేపీ దృష్టిలో అభివృద్ధి అంటే ఆడంబరం కాదని
చేతల్లోనూ చూపిస్తామని ప్రధాని తెలిపారు. పేదలు, గిరిజనులు, వెనుకబడిన వర్గాలకు పక్కా ఇళ్లు, ప్రతీ ఇంటికి మంచి నీటిని అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని
చెప్పారు. అక్షయ పాత్ర సంస్థ దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో భారీ సంఖ్యలో విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందిస్తోందని… ఈ సంస్థ ద్వారా వారణాసిలో 150 పాఠశాలలకు
భోజనం సరఫరా చేస్తారన్నారు. సొంత నియోజకవర్గం వారణాసిలో ప్రజల మధ్య ఉండడం తనకెప్పుడూ సంతోషం కలిగిస్తోందన్నారు మోదీ.