Andhra PradeshHome Page Slider

దుర్గమ్మ గుడిలో తొలిసారి మహాచండీ అలంకారం

Share with

అమరావతి: దసరా ఉత్సవాల్లో భాగంగా విజయవాడ ఇంద్రకీలాద్రిపై జగన్మాత దుర్గమ్మ తొలిసారి మహాచండీ అలంకారంలో భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. ఈ మేరకు ఆలయ వైదిక కమిటీ సభ్యులు నిర్ణయించారు. త్రిశక్తి స్వరూపిణి అయిన మహాచండీ దేవిని ప్రార్థిస్తే సర్వదేవతలనూ కొలిచినట్లేనని భక్తుల విశ్వాసం. సింహ వాహనంపై కొలువుదీరిన మహాచండీ రూపంలో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తారు. చండీదేవి అలంకారంలో జగన్మాతను ఈ నెల 19న వీక్షించే అవకాశం భక్తులకు దొరకనుంది. మరోవైపు దసరా శరన్నవరాత్రి ఉత్సవాల నేపథ్యంలో ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ సన్నిధిని విద్యుత్ దీపాలతో అలంకరించారు.