Andhra PradeshHome Page Slider

వైఎస్ విజయమ్మకు తప్పిన ప్రమాదం

Share with

ఒంగోలు ట్రంక్ రోడ్డు: దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి సతీమణి, సీఎం జగన్మోహన్ రెడ్డి తల్లి విజయమ్మకు శుక్రవారం తృటిలో ప్రమాదం తప్పింది. హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గాన ఆమె ఒంగోలు వెళ్తుండగా తెలంగాణ రాష్ట్రం నల్గొండ జిల్లా వాడపల్లి వద్ద విజయమ్మ ప్రయాణిస్తున్న వాహనానికి ముందుగా వెళ్తున్న వాహనం స్లో అవడంతో డ్రైవర్ ఒక్కసారిగా బ్రేక్ కొట్టాడు. దీంతో అదే వాహన శ్రేణిలోని మరొకటి వెనుక నుంచి వచ్చి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో విజయమ్మ ప్రయాణిస్తున్న కారు వెనుకభాగం స్వల్పంగా దెబ్బతింది. వైవి సుబ్బారెడ్డి తల్లిని పరామర్శించుటకు వెళ్లిన సందర్భంలో.. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న తన సోదరి అత్త, తితిదే మాజీ ఛైర్మన్ వైవి సుబ్బారెడ్డి తల్లి పిచ్చమ్మను ఒంగోలులో విజయమ్మ పరామర్శించారు. ఆమె రాత్రికి అక్కడే బస చేసి శనివారం ఉదయం తిరిగి హైదరాబాద్‌కి వెళ్లనున్నారు.