కేసీఆర్ సర్కార్ ను త్వరలోనే గోదావరిలో కలిపేస్తారు…
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గత వారం రోజులుగా కురుస్తున్న వరదలు బీభత్సం సృష్టించాయి. ఈ వరదల వల్ల అనేక ప్రాంతాల్లో ఆస్తి,పంట నష్టం తీవ్ర స్థాయిలో జరిగింది. అనేక ప్రాంతాల్లో పంటను కోల్పొయి రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.అయితే భారీ వర్షాలు పడినప్పటికీ… రాష్ట్రంలో పెద్ద పంట నష్టం జరగలేదని, అసలు అలాంటి సమాచారం కూడా ఏది మాకు రాలేదని కేటీఆర్ అన్నారు. దీనిపై టీపీసీసీ ప్రచార కమిటీ ఛైర్మన్ మధుయాష్కీ గౌడ్ మండిపడ్డారు. కేటీఆర్ నీకు కనీస ఇంగిత జ్ఞానం ఉందా? రాష్ట్రంలో దాదాపు 11 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగిందని అధికారులు చేప్పుతూంటే..మతిస్థిమితం లేని వాడిలా మాట్లాడుతున్నావు.
తమ్ముడు తారక రామారావు.. నీకు తెలియకపోతే జర అధికారులను అడిగి తెలుసుకో.పంట నష్టం జరిగి రైతులు బాధపడుతూంటే మిడిమిడి జ్ఞానంతో మాట్లాడకు కడుపు మండిన అన్నదాతలు..నిన్నూ మీ సర్కార్ ను త్వరలోనే గోదావరిలో కలిపేస్తారు అంటూ ట్విట్ చేశారు.కాగా సిరిసిల్ల జిల్లాలో ప్రెస్ మీట్‌లో మంత్రి కేటీఆర్ రాష్ట్రంలో ఎటువంటి పంట నష్టం జరగలేదని వ్యాఖ్యానించడం విడ్డూరం.