అర్వింద్ కాన్వాయ్ దాడిపై స్పందించిన అమిత్ షా
జగిత్యాలలో బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ కాన్వాయ్‌పై దాడి ఘటనను హోం మంత్రి అమిత్ షా ఖండించారు. దాడి ఘటన సమాచారం తెలుసుకున్న అమిత్ షా అర్వింద్‌కు ఫోన్ చేసి మాట్లాడారు. తనపై ప్లాన్ ప్రకారమే దాడి జరిగిందని… అర్వింద్ అమిత్ షాకు వివరించారు. బీజేపీ నేతలను, కార్యకర్తలను టీఆర్ఎస్ టార్గెట్ చేస్తోందని ఎంపీ తెలిపారు. పార్లమెంట్ నియోజకవర్గంలో ఎక్కడ తిరిగినా దాడులు చేయాలని పార్టీ ఆదేశించిందని… ఇవాళ్టి దాడి వెనుక ఎమ్మెల్యే విద్యా సాగర్ ఉన్నారని… అమిత్ షాకు… అర్వింద్ వివరించారు. గోదావరి ముంపును చూసేందుకు వెళ్లిన ఎంపీని గ్రామస్తులు అడ్డుకోవడం వివాదాస్పదంగా మారింది. భూవివాదాన్ని పరిష్కరించకుండా వచ్చారంటూ ఎంపీని… టీఆర్ఎస్ కార్యకర్తలే కావాలని ఘెరావ్ చేసినట్టు తెలుస్తోంది.
Read More: అర్వింద్ పై దాడి టీఆర్ఎస్ పనేనన్న ఈటల