NewsTelangana

రేవంత్ ట్వీట్-కేసీఆర్ హాట్

Share with

తెలంగాణా ప్రతిష్టాత్మకంగా ప్రకటించుకుంటున్న రూ.లక్ష కోట్లతో నిర్మించిన కాళేశ్వరం అవినీతిపై మరోసారి చర్చ జరుగుతోంది. తాజాగా రేవంత్‌రెడ్డి చేసిన ట్వీట్ తో ప్రభుత్వంపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. రూ.లక్ష కోట్లతో నిర్మించిన కాళేశ్వరం (అన్నారం పంప్ హౌస్) నీళ్లలో నిండా మునిగింది. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి ఎన్నో వివాదాలు చూస్తూనే ఉన్నాం

 భారీ వరదలతో కాళేశ్వరం తీవ్ర ముంపునకు గురైంది. దేశానికే మార్గదర్శకం, ఆదర్శం అంటూ తెలంగాణ ప్రాజెక్టుల గురించి తరచూ గొప్పలు చెప్పుకుంటుంది టీఆర్ఎస్ సర్కార్. జాతీయ రాజకీయాలు అంటూ చరిత్ర సృష్టిస్తామంటున్నారు కేసీఆర్. బీజేపీ సర్కార్ ను కూల్చేస్తామంటూ హెచ్చరికలు జారీ చేస్తున్నారు. తెలంగాణ ప్రాజెక్టులు దేశానికి ఆదర్శమంటున్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌ను తెలంగాణ వర ప్రదాయని అంటున్నారు. ఐతే  బీజేపీ, కాంగ్రెస్ మాత్రం ఈ ప్రాజెక్ట్ వెనుక వేల కోట్ల అవినీతి జరిగిందని విమర్ళలు చేస్తున్నాయి. తెలంగాణ ప్రజల కష్టార్జితం కేసీఆర్ అవినీతికి బలైందంటూ రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలతో ఇప్పుడు దేశ వ్యాప్తంగా ఇదే అంశంపై అటెన్షన్ నెలకొంది.

లక్షల కోట్లు పెట్టి ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టి…. ఇలా  నీళ్ల పాలు చేస్తారా అంటూ ప్రభుత్వంపై ప్రశ్నల వర్షం కురుపించారు రేవంత్. అటు బీజేపీ కూడా కాళేశ్వరం అవినీతిపై విమర్శలు గుప్పిస్తోంది.  పంప్ హౌస్ మునకపైనా తీవ్రస్థాయిలో విరుచుకుపడుతోంది.