పదునైన పదజాలంపై పార్లమెంట్ నిషేధం..!
పార్లమెంట్ సమవేశాల్లో అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం సర్వసాధారణమైన విషయమే. సమావేశాలలో అప్పుడప్పుడు పదునైన పదజాలాన్ని ఉపయోగిస్తుంటారు. అయితే ఇప్పటికే పార్లమెంట్ నిబంధనల ప్రకారం కొన్ని పదాలను సభలో ఉపయోగించడంపై పార్లమెంట్‌లో నిషేధం ఉంది. దీనిపై తాజాగా లోక్‌సభ సెక్రటేరియట్ ఓ కొత్త బుక్‌లెట్ విడుదల చేసింది. దీని ప్రకారం ‘జుమ్లాజీవి’, ’కొవిడ్ స్పైడర్’, ’స్నూప్ గేట్’ వంటి పదాలను పార్లమెంట్‌లో వాడటంపై నిషేధం విధించింది. వీటితో పాటుగా సర్వసాధారణంగా ఉపయోగించే ‘సిగ్గుచేటు’, ’వేధించడం’, ’మోసగించడం’, ’అవినీతి పరుడు’, ’డ్రామా’, ’హిపోక్రసీ’, ’నియంత’ అనే పదాలను కూడా ఉపయోగించకూడదని బుక్‌లెట్‌లో పెర్కొంది. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జూలై 18 నుండి ప్రారంభంకానున్న తరుణంలో లోక్‌సభ ఈ నిషేధ పదాల జాబితాను విడుదల చేసింది. ఈ జాబితా ప్రకారం శకుని, తానాషా, వినాశ పురుష్, ఖలిస్ధానీ, ద్రోహ చరిత్ర, చంచా, చంచా గిరి, పిరికివాడు, క్రిమినల్, గాడిద, ముసలి కన్నీళ్లు, అసమర్ధుడు, గుండాలు, అహంకారి, చీకటి రోజులు, దాదాగిరి, లైంగిక వేధింపులు, విశ్వాసఘాతకుడు వంటి పదాలను సభ్యులు తమ ప్రసంగాలలో ఉపయోగించకూడదని పేర్కొంది. సమయానుసారంగా కొందరు నిషేధిత పదాలని ఉపయోగించిన పార్లమెంట్ వాటిని రికార్డుల నుండి వెంటనే తొలగిస్తుంది. ఈ జాబితాపై లోక్‌సభ పార్లమెంట్‌లో ఎన్నో విమర్శలొస్తున్నాయి. దీనిపై టీఎంసీ ఎంపీ డెరెక్ ఒబ్రెయిన్ మండిపడ్డారు. సాధారణ పదాలను కూడా ఈ జాబితాలో ఇవ్వడం సరికాదన్నారు. ప్రసంగిచేటప్పుడు అసమర్ధుడు, అవినీతి, సిగ్గుచేటు, వేధింపు, మోసం వంటి సాధారణ పదాలను కూడా వాడొద్దనడం ఎలా అని ప్రశ్నించారు. అ పదాలను నేను ఉపయోగిస్తాను కావాలంటే సస్పెండ్ చేసుకోవాలని స్పష్టం చేశారాయన. ప్రజాస్వామ్యం కొరకు పొరాడతా అంటూ ట్విట్టర్ వేదికగా తెలిపారు. దీనిపై అటు కాంగ్రెస్ పార్టీ కూడా మండిపడ్డారు. మోదీ సర్కారు నిజ స్వరూపాన్ని ప్రజలకు తెలియజేసేందుకు ప్రతిపక్షాలు వాడే పదాలను ‘అమర్యాదకరమైనని’ గా పేర్కొన్నారు. తర్వాత ఏంటి విశ్వగురు అంటూ కాంగ్రెస్ జనరల్ జైరాం రమేష్ కేంద్ర ప్రభుత్వంపై మండిపడ్డారు.
Read More: కొత్త పార్లమెంట్ భవనంపై కొత్త రచ్చ…