Andhra PradeshNews

హైకోర్టులో అమరావతి రైతుల లంచ్ మోషన్ పిటిషన్

ఏపీలో అమరావతి రైతుల పాదయాత్రకు వ్యతిరేకంగా అనేక ర్యాలీలు ,నిరసనలు ప్రారంభమయ్యాయి.  తాజాగా వికేంద్రికరణకు మద్దతు తెలుపుతూ.. విశాఖ గర్జన ర్యాలీ భారీ ఎత్తున జరిగిన విషయం తెలిసిందే. ఏపీలో జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ర్యాలీకి ఉత్తరాంధ్ర ప్రజలు భారీగా తరలి వచ్చి మద్దతు పలికారు. కాగా వారు అమరావతి రైతుల పాదయాత్రను తీవ్రంగా నిరసిస్తున్నట్లు తెలుస్తోంది. ఏపీలో అమరావతి పాదయాత్ర రైతులకు,వికేంద్రికరణ మద్దతుదారులకు మధ్య పలుమార్లు వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ నిరసనల కారణంగా అనేక చోట్ల ఉద్రిక్త పరిస్థితులు కూడా ఏర్పడ్డాయి. దీంతో అమరావతి రైతులు హైకోర్టులో పాదయాత్రకు అడ్డంకులు కలిగిస్తున్నారని పిటిషన్ దాఖలు చేశారు. ఐతే… పిటిషన్‌లో మార్పులు చేయాలని అమరావతి రైతులకు హైకోర్టు సూచించింది. హైకోర్టు అమరావతి రైతుల పిటిషన్‌పై వాదనలు రేపటికి వాయిదా వేసింది.