విశాఖలో ప్రేమోన్మాది ఘాతుకం
ప్రేమించలేదనే కోపంతో ఓ యువకుడు అతి కిరాతకంగా దాడి చేసిన ఘటన గురువారం విశాఖలో జరిగింది.విశాఖ జిల్లా పెదగంట్యాడ మండలం బీసి రోడ్డు కు చెందిన యువతిని …నీరజ్ శర్మ అనే ఉన్మాది ప్రేమ పేరుతో గత కొంత కాలంగా వేధించసాగాడు.అనేక మార్లు యువతిని మానసికంగా హింసించాడు.ఎంత కాలం గడుస్తున్నా తన ప్రేమని అంగీకరించలేదన్న అక్కసుతో గురువారం మథ్యాహ్నం యువతి నివసిస్తున్న బీసి రోడ్డుకి వెళ్లి పెద్దగా కేకలు వేసి పిలిచాడు.భయంతో ఇంట్లోకి వెళ్లిన యువతిపై …పరుగెత్తుకుంటూ వెళ్లి తన వెంబడి తెచ్చుకున్న ఇనుప రాడ్డుతో అతి కిరాతకంగా దాడి చేశాడు. తలకు బలమైన గాయమై,తీవ్ర రక్తస్రావం కావడంతో యువతి స్పృహ తప్పి పడిపోయింది.దీంతో నిందితుడు నీరజ్ శర్మ అక్కడ నుంచి పరారయ్యాడు. గాయాలపాలైన యువతిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. యువతి బంధువుల ఫిర్యాదు మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు.కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

