Breaking NewscrimeHome Page SliderPolitics

భ‌గ‌వంతుడా ఏ మ‌గ‌వాడికి కూడా ఇలాంటి క‌ష్టం రాకూడ‌దు

క‌లియుగంలో వింత‌లు విచిత్రాలు పెరిగిపోతున్నాయి.ఇన్నాళ్లు మ‌గ‌వాళ్లు చేసిన ప‌నుల‌ను ఆడ‌వాళ్లు చేసేస్తున్నారు.జంధ్యాల ఎప్పుడో జంబ‌ల‌కిడి పంబ అనే సినిమా తీస్తే అంతా చూసి స‌ర‌దాగా న‌వ్వుకున్నారు.కానీ ఆధునిక ప్ర‌పంచం ఏర్ప‌డ్డాక‌….ప్ర‌పంచం ఇంట‌ర్నేట్‌తో అనుసంధాన‌మై కుగ్రామంగా మారిపోక గ్లోబ‌లైజేష‌న్ జాఢ్యం బాగా పెరిగింది.దీంతో ఆడ‌వాళ్లు చేయాల్సిన ప‌నులు మ‌గ‌వాళ్లు…మ‌గ‌వాళ్లు చేయాల్సిన ప‌నులు ఆడ‌వాళ్లు చేస్తున్నారు.దీనికి సంబంధించి ఓ ఉదాహ‌ర‌ణ చూడండి.రోజుకు రూ.5000 ఇస్తేనే కాపురం చేస్తానని, లేదంటే చనిపోతానని తన భార్య వేధిస్తుందంటూ శ్రీకాంత్ అనే సాప్ట్‌వేర్ ఉద్యోగి బెంగళూరు లో వయ్యాలికావల్ ప్రాంత పోలీస్ స్టేష‌న్‌లో ఫిర్యాదు చేయ‌డం సంచ‌ల‌నాత్మ‌కంగా మారింది. ఓ యువతితో 2022లో వివాహం అయ్యింది శ్రీ‌కాంత్ కి.కరోన టైమ్ లో శ్రీకాంత్‌ వర్క్ ఫ్రమ్ హోమ్ ఉండడంతో ఇంటి నుండే పని చేస్తున్నాడు. జూమ్ ద్వారా విధులకు హాజరయ్యే సమయంలో త‌న భార్య‌ మధ్యలో అడ్డుగా వచ్చి డ్యాన్స్‌లు చేస్తూ త‌నని అకారణంగా తిట్టి వేధిస్తుంద‌ని వాపోయాడు.ఏమైనా అంటే చనిపోతానని బెదిరిస్తుందని,అయిదు వేలు రూపాయలు ఇస్తేగానీ కాపురం చెయ్య‌న‌ని బ్లాక్ మెయిల్ చేస్తుంద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశాడు. పోలీసులు భార్య‌ను స్టేష‌న్‌కి పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చారు.