Home Page SliderTelangana

“గాడిద గుడ్డు పెట్టినట్లే..కాంగ్రెస్ పథకాలు అమలు చేసినట్లే”:బండి సంజయ్

తెలంగాణా డిప్యూటీ సీఎం ఈ రోజు అసెంబ్లీలో రాష్ట్ర బడ్జెట్ ప్రవేశ పెట్టిన విషయం తెలిసిందే. కాగా దీనిపై కేంద్ర సహయ మంత్రి బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. గాడిద గుడ్డు పెట్టడం ఎంత నిజమో..కాంగ్రెస్ హామీలు అమలు చేయడం కూడా అంతే నిజమని ఆయన ఎద్దేవా చేశారు. డిప్యూటీ సీఎం చదివింది బడ్జెటా లేదా అప్పులు పత్రమా అని విమర్శించారు. కాగా ఈ హామీలు ఐదేళ్లల్లో కూడా అమలు చేయడం అసాధ్యమన్నారు. అయితే ఈ బడ్జెట్‌లో ఏ ఒక్క నియోజకవర్గం ఊసే లేదన్నారు. సీఎం రేవంత్ రెడ్డి,మంత్రులు రాజీనామా చేస్తారా అని ఆయన ప్రశ్నించారు. తెలంగాణాలో రాజకీయ ప్రయోజనం కోసం కాంగ్రెస్ పార్టీ ప్రజల మధ్య చిచ్చు పెట్టాలని చూస్తోందని బండి సంజయ్ ఆరోపించారు.