అమిత్ షాని కలిసిన లోకేష్..సెటైర్లు వేసిన అంబటి
నారా లోకేష్ ఇవాళ కేంద్ర మంత్రి అమిత్ షాతో భేటి అయిన విషయం తెలిసిందే. అయితే దీనిపై వైసీపీ మంత్రి అంబటి రాంబాబు సెటైర్లు వేశారు.అమిత్ షాని కలిసింది..బీజేపీలో విలీనం కావడానికేనా?అని లోకేష్‌ను ట్యాగ్ చేస్తూ మంత్రి అంబటి రాంబాబు ట్వీట్ చేశారు. కాగా ఈ రోజు ఢిల్లీలో అమిత్ షాని కలిసిన లోకేష్ ప్రతీకారం తీర్చుకునేందుకే చంద్రబాబును అరెస్ట్ చేశారని ఆయన దృష్టికి తీసుకు వెళ్లినట్లు తెలుస్తోంది. చంద్రబాబుపై కేసులు ,ట్రయల్ కోర్టు,హైకోర్టు,సుప్రీంకోర్టులో జరుగుతున్న విచారణపై లోకేష్ అమిత్ షాకు వివరంచారు.టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ చేసి వేధిస్తున్నారని లోకేష్ పేర్కొన్నారు.కాగా టీడీపీ అధినేత చంద్రబాబును స్కిల్ డెవలప్మెంట్ కేసులో సీఐడీ నెల రోజుల క్రితం అరెస్ట్ చేసింది.దీంతో ఏపీ రాజకీయాలు హీటెక్కాయి. అయితే నారా లోకేష్ కూడా అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో సీఐడీ అధికారులు నారా లోకేష్‌ను రెండు రోజులు విచారించారు. తాజాగా ఈ కేసులో నారా లోకేష్‌కు హైకోర్టులో ఊరట లభించింది.