NationalNews

భళా ఇండియా… 200 కోట్ల వ్యాక్సిన్ డోసుల పంపిణీ పూర్తి

Share with

ఇండియా చరిత్ర సృష్టించింది. వ్యాక్సిన్ పంపిణీలో 200 కోట్ల డోసుల రికార్డును చేరుకొంది. కరోనా వ్యాక్సిన్ ఎలా అనుకుంటున్న తరుణంలో దేశీయంగా వ్యాక్సిన్ రూపొందించేలా చేసి… అది పేద, ధనిక తేడా లేకుండా అందరికీ ఉచితంగా అందించేలా చేసి చరిత్ర సృష్టించారు ప్రధాని నరేంద్ర మోదీ. జనవరి 16,2021న దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభం కాగా… 18 నెలల్లో 200 కోట్ల డోసుల రికార్డును చేరుకొంది. ఆదివారం మధ్యాహ్నం 2 కోట్ల 15, 631 కోట్ల రికార్డును చేరుకున్నట్టు కేంద్ర ఆరోగ్య శాఖ పేర్కొంది. వ్యాక్సిన్ పంపిణీలో కేంద్రం రికార్డు సృష్టించిందని ప్రధాని మోదీ చెప్పారు. యావత్ ప్రపంచానికి ఇండియా ఆదర్శంగా నిలిచిందన్నారు మోదీ. దేశంలో ఇప్పటి వరకు 98 శాతం ప్రజలు కనీసం ఒక్క డోస్ తీసుకున్నారు. 90 శాతం అర్హులకు రెండో డోస్ లభించింది. ఇప్పటి వరకు ప్రికాషన్ డోస్ ప్రైవేటుగా మాత్రమే అందుబాటులో ఉంచగా… ప్రస్తుతం ప్రభుత్వం ఉచితంగా అందిస్తోంది. రెండు, మూడో డోస్ మధ్య వ్యవధి తొలుత 9 నెలలుగా నిర్ధారించిన కేంద్రం.. ప్రస్తుతం ఆరు నెలలకు వ్యవధి తగ్గించింది.