NewsTelangana

కేసీఆర్ క్లౌడ్ బరస్ట్ కామెంట్స్ రగడ…

Share with

ఒకేసారి కుండపోత వర్షాలు కురవడంపై తెలంగాణ సీఎం కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కుండపోత వర్షాలపై కుట్రలు ఉన్నట్టు తెలుస్తోందని… ఇది ఎంత వరకు నిజమన్నది తెలియదంటూ కామెంట్స్ చేశారు. విదేశీయులు కొందరు… దేశంలో అక్కడక్కడా క్లౌడ్ బరస్ట్ చేస్తున్నట్టు తెలుస్తోందని వ్యాఖ్యానించారు. గతంలో జమ్ము, కశ్మీర్, లడక్, లేహ్, ఉత్తరాఖండ్‌లో పలు చోట్ల అలా చేశారంటూ ప్రచారం జరిగిందన్నారు. తాజాగా గోదావరి పరీవాహ ప్రాంతంలో ఇలా జరుగుతున్నట్టు సమాచారం అందిందన్నారు.


సీఎం వ్యాఖ్యలపై మాజీ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. సీఎం క్లౌడ్ బరెస్ట్.. అంతర్జాతీయ కుట్రతో వరదలు వచ్చాయనేది సిల్లీ అన్నారు.
తెలంగాణ ప్రజలను డైవేర్ట్ చేయాలని కేసీఆర్ చూస్తున్నారన్నారు. ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి మాట్లాడడం సరైంది కాదన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు మునిగిపోయిందని…ప్రజలను తప్పుదోవ పట్టించడానికి కేసీఆర్ క్లౌడ్ బరెస్టు అంటూ చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు ఉత్తమ్.

భారీ వర్షాల వెనుక విదేశీ కుట్ర ఉందనడం ఈ శతాబ్దపు జోక్ అన్నారు బీజేపీ తెలంగాణ చీఫ్ బండి సంజయ్. వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి డ్రామాలాడుతున్నారన్నారు. కేసీఆర్ తప్పిదాల వల్లే కాళేశ్వరం ప్రాజెక్టు మునిగిందని… ప్రజలను తప్పుదోవపట్టించేందుకు విదేశీ కుట్ర అంటూ డ్రామాలాడుతున్నారన్నారు. కుట్రలకే పెద్ద కుట్రదారుడు కేసీఆర్ అని ఆయన మాటలు ఎవరు నమ్ముతారన్నారు సంజయ్.