శాసనమండలి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు దాదాపు ఖరారు ?
•సామాజిక వర్గాల వారీగా అభ్యర్థులకు అవకాశం
•బీసీ, ఎస్సీ ,ఎస్టీ, మైనారిటీ వర్గాలకు పెద్ద పీట
•కసరత్తు పూర్తి చేసిన ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి
ఏపీ లో శాసనమండలి ఎన్నికలకు సంబంధించి స్థానిక సంస్థలు, ఎమ్మెల్యే, గవర్నర్ కోటాలో అభ్యర్థుల ఎంపిక సంబంధించి ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి కసరత్తు పూర్తి చేసినట్లు తెలిసింది. జగన్ శాసనమండలి ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా వేగంగా పావులు కదుపుతున్నారు. ఈసారి 175 నియోజకవర్గాల్లో గెలుపే లక్ష్యంగా పార్టీ బలహీనంగా ఉన్న నియోజకవర్గాలలో బలమైన సామాజిక వర్గాలను ఎంపిక చేసుకొని ఆ సామాజిక వర్గానికి చెందినవారికి ఈసారి ఎమ్మెల్సీ పదవులు కట్టబెట్టినందుకు వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు. ప్రశాంత్ కిషోర్ ఐ ప్యాక్ టీం సూచించినట్లుగా బీసీ, ఎస్సీ ,ఎస్టీ, మైనారిటీ వర్గాలకు పెద్ద పీట వేసినట్లు తెలిసింది.

స్థానిక సంస్థల్లో నెల్లూరు నుంచి మేరీగ మురళీధర్ (గూడూరు), కడప నుంచి పి. రామ సుబ్బారెడ్డి (మాజీ మంత్రి జమ్మలమడుగు), తూర్పుగోదావరి జిల్లా నుంచి కుడిపూడి సూర్యనారాయణ (అమలాపురం) జయ మంగళం వెంకటరమణ (మాజీ ఎమ్మెల్యే కైకలూరు), అనంతపురం నుంచి మాజీ ఎంపీ హిందూపురం గంగాధర్ లేదా ఆయన సతీమణి, లేదా నవీన్ నిచ్చల్, రజక కార్పొరేషన్ చైర్మన్ రంగన్న, పశ్చిమగోదావరి జిల్లాలో వంకా రవీంద్ర లేదా జి . నాగబాబు శ్రీకాకుళంలో నీలకంఠ నాయుడు లేదా నర్త రామారావు ఎమ్మెల్యేల, గవర్నర్ కోటాలో డొక్కా మాణిక్య వరప్రసాద్, మర్రి రాజశేఖర్, పోతుల సునీత, ఎస్ సి వి నాయుడు, డాక్టర్ సిపాయి సుబ్రమణ్యం, యార్లగడ్డ వెంకట్రావు, చల్లా శ్రీలక్ష్మి, జంకె వెంకటరెడ్డి, రావి రామనాథం బాబు, ముస్లింలలో ఒకరికి, బొప్పన భువన కుమార్ తదితరుల పేర్లు పరిశీలనలో ఉన్నట్లు సమాచారం అందుతుంది. ఇప్పటికే ఉపాధ్యాయ, పట్టభద్రుల స్థానాలకు అభ్యర్థులు ప్రకటించిన విషయం విదితమే.

ఇదిలా ఉండగా ఎమ్మెల్సీ ఎన్నికల అనంతరం మంత్రివర్గంలో కూడా మార్పు చేర్పులు జగన్ చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఒకవేళ మంత్రివర్గంలో మార్పులు చేర్పులు చేయాల్సి వస్తే ఈసారి ఎమ్మెల్సీలలో ఒకరిద్దరికి అవకాశం కల్పించేలా సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నట్లు పార్టీ వర్గాల్లో పెద్ద ఎత్తున ప్రచారం సాగుతుంది. ఒక బెర్త్ ను గుంటూరు జిల్లా నుండి మరొక బెర్త్ ను రాయలసీమ జిల్లాలకు ఇవ్వాలని సీఎం ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. ఎమ్మెల్సీ ఎన్నికల పూర్తయ్యేలాగా ప్రస్తుతం మంత్రుల పనితీరు ఆధారంగా మంత్రివర్గ మార్పులు చేర్పులు చేసే అవకాశం ఉంటుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

