Andhra PradeshHome Page Slider

వైసీపీ ప్రభుత్వానికి కౌంట్ డౌన్ మొదలయ్యిందన్న ప్రధాని మోదీ

Share with

రాజంపేట ఎన్డీఏ సమావేశంలో ప్రధాని మోదీ పాల్గొన్నారు. నా ఆంధ్రా కుటుంబ సభ్యులకు నమస్కారమంటూ ప్రధాని నరేంద్రమోదీ రాజంపేటలో ప్రసంగం మొదలుపెట్టారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలన్నది మోదీ లక్ష్యమన్నారు. రాయలసీమ సహజ సంపదకు నిలయమన్నారు. రాయలసీమలో ప్రసిద్ధి చెందిన ఆలయాలున్నాయన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ హయాంలో సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం జరగకపోవడంతో, రైతులు ఆందళనలో ఉన్నారన్నారు. పుంగనూరులో ఐదేళ్లుగా రౌడీ రాజ్యం నడుస్తోందన్నారు మోదీ. ఐదేళ్లుగా ఉద్యోగాలు లేవన్నారు. రైతులు ఇబ్బందుల్లో ఉన్నారన్నారు. నమ్మి అధికారంలోకి తెస్తే వైసీపీ మోసం చేసిందన్నారు. పేదల వికాసం కాకుండా, మాఫియా వికాసం కోసం వైసీపీ పనిచేసిందన్నారు. ఇసుక మాఫియా వల్ల అన్నమయ్య డ్యామ్ కొట్టుకుపోయిందన్నారు. ఎన్డీఏ సర్కారు వచ్చాక అన్ని మాఫియాలకు ట్రీట్మెంట్ ఇస్తామన్నారు. ఈ కార్యక్రమంలో నారా లోకేష్, కొణెదెల నాగబాబుతో సహా రాజంపేట బీజేపీ ఎంపీ అభ్యర్థి ఎన్ కిరణ్ కుమార్ రెడ్డి, తిరుపతి బీజేపీ ఎంపీ అభ్యర్థి వరప్రసాద్ పాల్గొన్నారు.

ఆంధ్రప్రదేశ్ లో మార్పు రావాలని, డబుల్ ఇంజిన్ సర్కారు రావాలని చెప్పారు. వైసీపీ ప్రభుత్వానికి కౌంట్ డౌన్ మొదలయ్యిందన్నారు. వైసీపీ మంత్రులు గుండాయిజం చేస్తున్నారన్నారు. మాఫియాకు ఇక్కడి ప్రభుత్వం మద్దతిస్తోందన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం మాఫియాకు పక్కా చికిత్స చేస్తోందన్నారు. వైసీపీ ప్రభుత్వం జల్ జీవన్ మిషన్‌కు సహకరించడం లేదన్నారు. పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయడం లేదన్నారు మోదీ. గల్ఫ్ లోని భారతీయుల కష్టాలను కేంద్రం పట్టించుకుందన్నారు. దేశాన్ని రివర్స్ గేర్ లో తీసుకెళ్లేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోందన్నారు మోదీ. ఆర్టికల్ 370ని మళ్లీ తీసుకొస్తామని కాంగ్రెస్ అంటోందన్నారు. పేదలకు ఉచిత రేషన్ ను కాంగ్రెస్ రద్దు చేస్తామంటోందన్నారు. రామమందిరానికి తాళం వేస్తామని కాంగ్రెస్ అంటోందన్నారు. కాంగ్రెస్ పార్టీ దేశాన్ని ముక్కలు చేయాలని చూస్తోందని మోదీ విమర్శించారు. కాంగ్రెస్ వల్ల దేశ విభజన జరిగిందన్నారు.

గాంధీ కుటుంబానికి దగ్గరగా ఉండే నాయకులు మాట్లాడే మాటలు వింటుంటే సిగ్గేస్తోందన్నారు. దక్షిణాది రాష్ట్రాల ప్రజలు ఆఫ్రికన్లలా ఉంటారని అంటున్నారన్నారు. ఈ వ్యాఖ్యలను తెలంగాణ, తమిళనాడు సీఎంలు సమర్థిస్తారా అని మోదీ ప్రశ్నించారు. దక్షిణాదిలో పారిశ్రామిక అభివృద్ధి వేగంగా జరుగుతోందన్నారు. కడప, బెంగళూరు మధ్య కొత్త రైల్వే లైన్ ప్రారంభమైందన్నారు. దక్షిణాది రాష్ట్రాలకు బుల్లెట్ ట్రైన్ కావాలా వద్దా అని మోదీ ప్రశ్నించారు. ఇప్పటికే నంద్యాల-ఎర్రగుంట్ల రైల్వే లైన్ పూర్తయ్యిందన్నారు. కడప విమానాశ్రయాన్ని అభివృద్ధి చేస్తామన్నారు. రాయలసీమలో ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమను ప్రోత్సహిస్తామన్నారు. టమాటో నిల్వ చేసేందుకు గిడ్డంగులను అందుబాటులోకి తెస్తామన్నారు. ఆంధ్రప్రదేశ్ వికాం.. మోదీ లక్ష్యమంటూ తెలుగు మాట్లాడారు మోదీ. ఇంటింటికీ పైప్ లైన్ల ద్వారా నీళ్లు అందించాలన్న లక్ష్యం తమదని మోదీ చెప్పారు.