లాలూ కుమార్తె పెద్ద మనుసు.. తండ్రికి కిడ్నీ సాయం
తండ్రికి సాయం చేయడం గర్వంగా ఉందన్న రోహిణి ఆచార్య
కిడ్నీ సమస్యతో బాధపడుతున్న 74 ఏళ్ల లాలూ యాదవ్
గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న బీహార్ రాజకీయ నాయకుడు లాలూ యాదవ్ తన కుమార్తె రోహిణి ఆచార్య నుంచి కిడ్నీ తీసుకోనున్నారు. ఈ నెలాఖరులో ఆర్జేడీ నేత కిడ్నీ మార్పిడి శస్త్ర చికిత్స చేయించుకోనున్నారు. అవును, నిజమే. నేను విధిని నమ్ముతాను. నా కిడ్నీని తండ్రికి ఇవ్వడం చాలా గర్వంగా ఉందన్నారు…. లాలూ యాదవ్ రెండో కుమార్తె రోహిణి ఆచార్య. 74 ఏళ్ల లాలూ యాదవ్ చికిత్స కోసం వెళ్లి… సింగపూర్ నుంచి గత నెలలో తిరిగి వచ్చారు. ప్రముఖ రాజకీయ నాయకుడు, మూడుసార్లు బీహార్ ముఖ్యమంత్రిగా పనిచేసిన ఆయన అనేక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఇటీవలే ఆయనకు కిడ్నీ మార్పిడి చేయాలని వైద్యులు సూచించారు. రోహిణి ఆచార్య తన తండ్రికి కొత్త జీవితాన్ని ఇచ్చేందుకు రంగంలోకి దిగారంటూ కుటుంబ సభ్యులను ఉటంకిస్తూ వార్తా సంస్థ పిటిఐ పేర్కొంది. రోహిణి ఆచార్య గత నెలలో ఒక ట్వీట్‌లో తన తండ్రితో ఉన్న ఫోటోలను పంచుకున్నారు. “దేశం నిరంకుశ ఆలోచనతో పోరాడటానికి… ఈ దేశానికి మీ ఉనికి అవసరం” అని ఆమె రాసుకొచ్చింది. ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న లాలూ యాదవ్ బెయిల్‌పై బయట ఉన్నారు. దాణా కుంభకోణం కేసుల్లో ఆయన జైలుకెళ్లారు. అతను చికిత్స కోసం ఢిల్లీ, రాంచీలలో పలుసార్లు ఆసుపత్రిలో చికిత్స పొందారు.