Home Page SliderTelangana

హైదరాబాద్‌కు కృష్ణా జలాలు నిలిపివేత

హైదరాబాద్: మహానగరానికి ఫేజ్ 2లోని కృష్ణా జలాలను నిలిపివేశారు. పంపింగ్‌లో తొలిసారిగా నీటిఒత్తిడికి నాన్ రిటర్న్ వాల్వ్ ఎగిరిపోయి పూర్తిగా ధ్వంసమైంది. దీంతో నీరంతా కోదండాపూర్ పంపింగ్ హౌస్ ప్రాంతానికి చేరింది. వెంటనే అప్రమత్తమైన అధికారులు, సిబ్బంది నగరానికి అత్యవసరంగా కృష్ణా జలాలు ఫేజ్-2 నీటి సరఫరాను నిలిపివేశారు. యుద్ధప్రాతిపదికన మరమ్మతు పనులు ప్రారంభించారు. గురువారం రాత్రి వరకు పనులు కొనసాగే అవకాశాలున్నాయి.