ప్రధానితో భేటి కానున్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
ప్రధాని మోదీతో కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి భేటీ కానున్నారు. రేపు ఉదయం 11 గంటలకు మోదీతో వెంకట్ రెడ్డి కలుసుకోనున్నారు. తన పార్లమెంట్ నియోజకవర్గంలో అభివృద్ధి పనుల విషయమై వెంకట్‌రెడ్డి చర్చించనున్నారు. మూసీ ప్రక్షాళనతో పాటు విజయవాడ – హైదరాబాద్ జాతీయ రహదారి విస్తరణ పనుల అంశంపై ప్రధానితో చర్చ జరగనుంది. మూసీతోపాటు మరికొన్ని అభివృద్ధి పనులపై మోదీతో వెంకట్‌రెడ్డి చర్చించనున్నారని సమాచారం.
ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేతో కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి ఇటీవలే న్యూఢిల్లీలో సమావేశమయ్యారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితిపై చర్చించారు. ఎన్నికలకు నెల రోజుల ముందే తాను రాజకీయాల గురించి మాట్లాడుతానని మూడు రోజుల క్రితం వెంకట్ రెడ్డి ప్రకటించారు. తాను ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో ఉన్నట్టుగా తెలిపారు.

