‘ఏ బిడ్డా..ఇది నా అడ్డా’.. కోహ్లి వీడియో వైరల్
ఆదివారం జరిగిన ఢిల్లీ క్యాపిటల్స్, ఆర్సీబీ మ్యాచ్‌లో ఆర్సీబీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ పూర్తయ్యాక కోహ్లి సంబరాలు చేసుకున్న వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఈ మ్యాచ్ ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగింది. విరాట్ కోహ్లి ఇది నా సొంత మైదానం అంటూ ఢిల్లీ ప్లేయర్ కేఎల్ రాహుల్‌ను టీజ్ చేశాడు. ఈ వేడుక వీడియోలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. ఇటీవల కేఎల్ రాహుల్ బెంగళూరు మైదానంలో ‘ఇది నా అడ్డా’ అంటూ వేడుక చేసుకున్నాడు. దీనితో విరాట్ కూడా ఢిల్లీ గ్రౌండ్ తనదంటూ సెటైర్ వేశాడు. కోహ్లిది ఢిల్లీ, కేఎల్ రాహుల్‌ది బెంగళూరు కావడం గమనార్హం. బెంగళూరు 10 మ్యాచ్‌ల అనంతరం పాయింట్ల పట్టికలో 14 పాయింట్లు సాధించింది. 163 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన బెంగళూరు మొదట్లో తడబడినా కోహ్లి 51 పరుగులు, కృణాల్ పాండ్యా 73 పరుగులు చేయడంతో విజయానికి చేరువయ్యింది. దీనితో ఐపీఎల్ 2025లో విరాట్ కోహ్లి అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా నిలిచాడు. 10 మ్యాచ్‌లలో ఆరు అర్థసెంచరీలతో 443 పరుగులు చేశాడు.

