సిరాజ్ కొత్త ఇంట్లో కింగ్ కోహ్లీ సందడి
రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు టీమ్ ఆటలోనే కాదు బయట కూడా చాలా సన్నిహితంగా ఉంటారు.కాగా RCB ప్లేయర్ మహమ్మద్ సిరాజ్ ఇటీవల హైదరాబాద్ ఫిలింనగర్‌లో కొత్త ఇంటిని కట్టుకొన్నారు. అయితే సిరాజ్ తన కొత్త ఇంటికి RCB ప్లేయర్స్‌ని ఆహ్వనించాడు. దీంతో ఆహ్వానాన్ని మన్నించిన కెప్టెన్ ఫాఫ్ డూప్లిసెస్, స్టార్ బ్యాటర్ కింగ్ కోహ్లీ విచ్చేసి సందడి చేశారు. వీరితోపాటు కేదార్ జాదవ్,పార్నెల్,ఇంకా మరికొందరు RCB ప్లేయర్స్ కూడా సిరాజ్ కొత్త ఇంటిని సందర్శించారు. కాగా సిరాజ్ వీరికి ప్రత్యేక విందును ఏర్పాటు చేశారు.ఈ స్టార్ల రాకతో సిరాజ్ ఇంటి వద్ద హంగామా నెలకొంది.

