ఏసిబి వలలో ఖమ్మం కలెక్టరేట్ ఉద్యోగి
లంచం మరిగిన ఉద్యోగులు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏదో చోట ఏసిబికి పట్టుబడుతూనే ఉన్నారు.ఏసిబి దాడులు లేకుండా వారం రోజులు గడవడం పెద్ద ప్రహసనంగా మారిపోయింది. తాజాగా ఖమ్మం కలెక్టరేట్‌లో ఓ వ్యక్తి నుంచి రూ.40వేలు లంచం తీసుకుంటూ ఏసిబికి పట్టుబడ్డాడో ఉద్యోగి.సీనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నకట్టా నగేష్ రెవిన్యూ శాఖలో ఓ పని కోసం ఈ లంచం మొత్తాన్ని డిమాండ్ చేసినట్లు ఏసిబి అధికారులు వెల్లడించారు. లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుని వివరాలు సేకరించి కేసు నమోదు చేశారు.నిందితుణ్ణి ఏసిబి కోర్టులో హాజరు పరిచారు.

