Home Page SliderNews Alerttelangana,

హైడ్రా రంగనాథ్ కీలక వ్యాఖ్యలు

హైడ్రా కమిషనర్ రంగనాథ్ కూల్చివేతల విషయంలో కీలక వ్యాఖ్యలు చేశారు. ఇకపై హైడ్రా ఏర్పడక ముందు ఉన్న నిర్మాణాల జోలికి వెళ్లబోవడం లేదని క్లారిటీ ఇచ్చారు. నేడు ఆయన మైసమ్మ చెరువు, కాముని చెరువు పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ జూలై తర్వాత చేపట్టిన అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తామని, హైడ్రా ఏర్పడక ముందు ఉన్న నిర్మాణాల జోలికి వెళ్లడం లేదన్నారు. కొత్తగా తీసుకున్న అనుమతులను పరిశీలిస్తాం అన్నారు. ప్రభుత్వ విధానాలకు అనుగుణంగా చెరువుల పరిరక్షణకు పనిచేస్తున్నాం, పేదల జోలికి హైడ్రా రాదన్నారు. తప్పుడు ప్రచారాలు నమ్మొద్దని పేర్కొన్నారు.