సత్య నాదెళ్లతో సీఎం రేవంత్ రెడ్డి కీలక సమావేశం
మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్లతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, సీఎస్ శాంతికుమారితో కలిసి బంజారాహిల్స్ లోని సత్య నాదెళ్ల నివాసానికి ప్రత్యేకంగా వెళ్లి సమావేశమయ్యారు. ప్రధానంగా స్కిల్ యూనివర్సిటీ, ఏఐ క్లౌడింగ్ కంప్యూటింగ్ గురించి ఆయనతో చర్చిస్తున్నట్లు సమాచారం. ఫ్యూచర్ సిటీ, ఏఐ సిటీల ఏర్పాటు, రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యాలను సీఎం వివరించారని తెలుస్తోంది. మరోవైపు రాష్ట్రంలో మొత్తం 6 డేటా సెంటర్లను కంపెనీ ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది.

