Home Page SliderNational

జీఎస్టీ మండలి కీలక నిర్ణయాలు..ఇది తగ్గిస్తారా?

జీఎస్టీ విషయంలో అత్యున్నత నిర్ణయాలు తీసుకొనే జీఎస్టీ కౌన్సిల్ సెప్టెంబర్ 9న సమావేశం కానుంది. కేంద్ర ఆర్థిక మంత్రితో రాష్ట్రాల ఆర్థికమంత్రులు కూడా సభ్యులుగా ఉంటారు. ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకుంటారని ప్రస్తుతం ఉన్న పన్ను స్లాబులను తగ్గించే అవకాశం ఉందని భావిస్తున్నారు. గత సమావేశంలోనే ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ దీనిపై ప్రకటన చేశారు. బీమాపై కూడా జీఎస్టీ తొలగించాలని అనేకమంది డిమాండ్ చేస్తున్నారు. బీహార్ డిప్యూటీ సీఎం సుమంత్ చౌదరి ఈ సమావేశాలలో ప్రజంటేషన్ ఇవ్వనున్నారు. చివరి సారిగా జూన్ 22న ఈ భేటీ జరిగింది. అనంతరం ఇప్పుడు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నేతృత్వంలో ఢిల్లీలో కౌన్సిల్ 54వ సమావేశం జరగనుంది. ఈ విషయం జీఎస్టీ కౌన్సిల్ ట్విట్టర్‌లో పోస్టు చేసింది.