కేజ్రీవాల్ ఎక్కడికీ పారిపోరు
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్‌పై వాదనలు కొనసాగుతున్నాయి. సుప్రీంకోర్టులో కేజ్రీవాల్ తరపు న్యాయవాది అభిషేక్ సింఘ్వీ మాట్లాడుతూ కేజ్రీవాల్ రాజ్యాంగబద్దమైన పదవిలో ఉన్నారని, ఆయనెక్కడికీ పారిపోరని వ్యాఖ్యానించారు. అసలు మొదట ఎఫ్‌ఐఆర్‌లో ఆయన పేరు లేదని అన్యాయంగా అరెస్టు చేశారని పేర్కొన్నారు. మద్యం స్కామ్ కేసు లో సీబీఐ కేజ్రీవాల్‌ను రెండేళ్లపాటు అరెస్టు చేయలేదని తెలిపారు. ఈడీ పెట్టిన మనీలాండరింగ్ కేసులో కేజ్రీవాల్‌కు బెయిల్ లభించిన సంగతి గుర్తు చేశారు. ఆయనతో సమాజానికి జరిగే ముప్పు ఏదీ లేదని, ఆయనకు బెయిల్ మంజూరు చేయాలని కోరారు. ఇదే కేసులో మిగిలిన వారికి బెయిల్ వచ్చిన సంగతిని పేర్కొన్నారు.

