కీరవాణి సంగీతం.. చంద్రబోస్ సాహిత్యం ఎలా ఉంటుందో..
న్యూ టాలెంట్ రోర్స్ పతాకంపై యలమంచిలి గీత ఒక చిత్రం నిర్మిస్తున్నారు. శుక్రవారం ఈ సినిమాకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ అప్‌డేట్స్ వెలువడ్డాయి. తెలుగమ్మాయి వీణ రావు హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రానికి కీరవాణి సంగీతం, చంద్రబోస్ సాహిత్యాన్ని అందించబోతున్నారు. సాయిమాధవ్ బుర్రా సంభాషణల రచయిత. దర్శకుడు వైవీఎస్ చౌదరి మట్లాడుతూ ‘కీరవాణి యుగపురుషుడు లాంటివారు. ఆయన నాకు మర్చిపోలేని పాటలు అందించారు. అలాంటి గొప్ప వ్యక్తితో ఈ సినిమా తీయడం ఆనందంగా ఉంది. చంద్రబోస్ సాహిత్యం అద్భుతంగా ఉండబోతోంది. మంచి కూచిపూడి డ్యాన్సర్ అయిన తెలుగమ్మాయి వీణ రావుని కథానాయికగా పరిచయం చేస్తున్నాం అన్నారు. కీరవాణి, చంద్రబోస్, వైవీఎస్ చౌదరి వంటి గొప్ప వ్యక్తులతో కలిసి పనిచేయడం ఆనందంగా ఉందని సాయిమాధవ్ బుర్రా పేర్కొన్నారు.

