NewsTelangana

అంతంత మాత్రంగా సీఎం కేసీఆర్ ప్రజాదరణ

Share with

తెలంగాణ సీఎం కేసీఆర్‌ పనితీరుపై ప్రజల్లో మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది. జనాదరణలో సీఎం కేసీఆర్ 11వ ర్యాంక్ లో ఉన్నారు. సెంటర్ ఫర్ నేషనల్ ఒపినియన్ సర్వే తాజాగా విడుదల చేసిన సర్వే ఫలితాల్లో కేసీఆర్ మధ్యస్థానంలో నిలిచారు. కేసీఆర్ నాయకత్వంపై 49 శాతం ప్రజలు సంతృప్తిగా ఉంటే 19 శాతం తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు. 24 శాతం మంది తటస్థంగా ఉన్నారని సర్వే అభిప్రాయపడింది.

ప్రధాని మోదీతోపాటు… దేశంలోని 25 రాష్ట్రాల ముఖ్యమంత్రుల పనితీరుపై సంస్థ సర్వే రిపోర్ట్ విడుదల చేసింది. జగన్ నాయకత్వాన్ని 39 శాతం మంది మాత్రమే హర్షిస్తున్నారు. 29 శాతం మంది అసంతృప్తిగా ఉంటే… 32 శాతం మంది న్యూట్రల్ గా ఉన్నారు. ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ పై 70 శాతం ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తుండగా… ఆయన మొదటి ర్యాంకింగ్‌లో నిలిచారు. ఆ తర్వాత స్థానాల్లో యోగి ఆదిత్యనాథ్, హిమంత బిస్వాస్ శర్మ, భగవంత్ మాన్ సింగ్ నిలిచారు. ఇక ప్రధాని మోదీ ప్రజాదరణ రోజు రోజుకు పెరుగుతోంది. దేశంలో 54 శాతం మంది ఆయన నాయకత్వాన్ని ఆమోదిస్తున్నారు.

Read More: సింహాలపైనా సిల్లీ రాజకీయాలు