ఏపీలో విద్యారంగం అతలాకుతలం
◆172 ,117 జీవోల వలనే అంటున్న విద్యారంగ నిపుణులు
◆ పాఠశాల విద్యకు సంబంధించిన నేల విడిచి సాము చేస్తున్న ప్రభుత్వం
◆ పాఠశాలల విలీనం పేరుతో పేదలకు దూరమవ్వనున్న విద్య
ఆంధ్రప్రదేశ్లో విద్యారంగంలో వరుసగా వచ్చిన 172,117 జీవోలు వల్ల గతంలో లేని విధంగా విద్యారంగం అతలాకుతలంకానున్నదని విద్యారంగా నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ప్రభుత్వ రంగంలోని ప్రాథమిక ఉన్నత పాఠశాలలను బలోపేతం చేయకపోగా పాఠశాలల విలీనం పేరుతో తరగతుల తరలింపు పేరుతో ప్రభుత్వం పేద బడుగు బలహీన వర్గాలకు విద్యను దూరం చేస్తుందని , విద్యా స్థాయి పెరగకుండా జిడిపి వృద్ధిరేటు సాధ్యపడదని తెలిసి కూడా విద్యారంగాన్ని ప్రభుత్వం విస్మరిస్తుందని గ్రామాలలో ప్రాథమిక పాఠశాలల నుండి మూడు ,నాలుగు, ఐదు తరగతులను తరలించడం వల్ల, ఏకైక ఆంగ్ల మీడియం అమలు చేయడం వలన పాఠశాలలను విలీనం చేయటం వలన వచ్చే పర్యావసనాలు సంపూర్ణ అక్షరాస్యత లక్ష్యాన్ని మరింత దూరం చేస్తాయని వారు అభిప్రాయపడుతున్నారు.
రాష్ట్రంలో 30 వేల టీచర్ల పోస్టులు పైన ఖాళీలు ఉన్న ఆ పోస్టులను ప్రభుత్వం భర్తీ చేయడం లేదని, 117 జీవో అమలకు పూనుకొని రేషనలలైజేషన్ కూడ ప్రభుత్వం చేస్తుందని దీంతో 30 మంది విద్యార్థులకు ఒక టీచర్ ఉండే విధానాన్ని అమలు చేయడం తగదని వారు అంటున్నారు. ఒకటో తరగతి నుండి 8వ తరగతి వరకు ఆంగ్లంలోనే బోధన తప్పనిసరి చేయటం అందరికీ నాణ్యమైన విద్యను అందించే బాధ్యత తీసుకోకపోవడం ప్రభుత్వ పాఠశాలల మూసివేతలు విలీనాల వలన ప్రజలకు చదువు అందుబాటులో ఉండదని వారు విశ్వసిస్తున్నారు. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అమలు చేయడం వలన కూడా క్రమేపి కార్పొరేట్ సంస్థలు ఆదీనంలోకి ప్రభుత్వ పాఠశాలలు వెళ్తాయని దీనివల్ల పిల్లలు డ్రాప్ అవుట్ శాతం పెరుగుతుందని ముఖ్యంగా బాలికలు విద్యకు దూరం అవుతారని రాష్ట్ర ప్రజలు ఇటువంటి విద్యా విధానాలకు కోరుకోవటం లేదని ప్రభుత్వం పునర్ ఆలోచించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
Read More: ఏపీలో పడిపోయిన సీఎం గ్రాఫ్ !