NationalNews

కొన్ని నిర్ణయాలు కష్టంగానే ఉంటాయ్-ప్రధాని మోదీ

Share with

దేశం కోసం తీసుకొనే కొన్ని నిర్ణయాలు కష్టంగానే ఉంటాయని… కానీ దీర్ఘకాలంలో అవి ఎంతో మేలు చేస్తాయన్నారు ప్రధాని నరేంద్ర మోడీ. అగ్నిపథ్ నియామకాలపై దేశవ్యాప్తంగా నిరసనలు ఓవైపు… విపక్షాల ఆందోళనలు మరోవైపు ఉధృతమవుతున్న తరుణంలో ప్రధాని మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కొన్ని నిర్ణయాలు మొదట్లో అన్యాయంగా అనిపించినా, తర్వాత దేశ నిర్మాణానికి సహాయపడతాయన్నారు. అగ్నిపథ్ గురించి నేరుగా ఎలాంటి కామెంట్స్ చేయకుండానే మోడీ తన మనసులో మాట స్పష్టం చేశారు. కాంగ్రెస్‌తో సహా అనేక ప్రతిపక్ష పార్టీలు… నోట్ల రద్దు, వ్యవసాయ చట్టాల రద్దు తర్వాత అగ్నిపథ్ ను వెనక్కి తీసుకుంటారంటూ ప్రచారం చేస్తున్న తరుణంలో మోడీ ఈ వ్యాఖ్యలు చేశారు. అగ్నిపథ్ విషయంలో విమర్శలెన్ని వ్యక్తమవుతున్నా… కేంద్రం మాత్రం వెన్కకి తగ్గేదే లేదంటోంది. మారుతున్న కాలంలో… యుద్ధంలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడం కోసం ప్రయత్నిస్తున్నప్పుడు సైన్యంలో మార్పులు కూడా అవసరమని ఆర్మీ అంటోంది.