రేపు అసెంబ్లీలో అడుగు పెట్టనున్న కేసీఆర్
తెలంగాణా ప్రభుత్వం రేపు అసెంబ్లీలో రాష్ట్ర బడ్జెట్ ప్రవేశ పెట్టనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలంగాణా మాజీ సీఎం కేసీఆర్ రేపు అసెంబ్లీ సమావేశాలకు హాజరుకానున్నట్లు తెలుస్తోంది. కాగా రేపు అసెంబ్లీలో జరగబోయే బడ్జెట్ సమావేశాలలో కేసీఆర్ పాల్గొంటారని బీఆర్ఎస్ పార్టీ వర్గాలు వెల్లడించాయి. అయితే ఇదే జరిగితే కేసీఆర్ ప్రతిపక్ష నేత హోదాలో అసెంబ్లీకి రావడం ఇదే తొలిసారి కానుంది.కాగా నిన్న జరిగిన సమావేశంలో పార్టీ నేతలు అనుసరించాల్సిన వ్యూహాలపై కేసీఆర్ దిశానిర్దేశం చేసినట్లు సమాచారం.మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి కూడా కేసీఆర్ అసెంబ్లీకి రావాలని డిమాండ్ చేస్తున్నారు.

