కేసిఆరు సారూ…మా ఆతిథ్యం స్వీకరించండి సారూ
రేవంత్ సర్కార్.. రాష్ట్ర సచివాలయ ప్రాంగణంలో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేయతలపెట్టిన కొత్త తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు రావాలని ప్రభుత్వం తరుఫున మంత్రి పొన్నం ప్రభాకర్ శనివారం కేసిఆర్‌ని విజ్క్షప్తి చేశారు.ఈ మేరకు ఆయన ఎర్రవల్లి ఫాం హౌజ్‌లో మాజీ సీఎం కేసిఆర్ ని కలిశారు.ఈ నెల 9న తెలంగాణ తల్లి విగ్రహవిష్కరణ చేస్తున్నామని తెలిపారు. తెలంగాణ సాధించడంలో క్రియాశీలక పాత్ర పోషించిన ప్రముఖులందరినీ ఇలాగే ఆహ్వానిస్తున్నామని పొన్నం తెలిపారు.ఇది తెలంగాణ ప్రజల పండుగ అని ప్రతీ ఒక్కరూ ఈ కార్యక్రమాన్ని ఇంటి కార్యక్రమంగా భావించి జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.

