WCలో కార్తీక్ మెయ్యప్పన్ హ్యాట్రిక్
ప్రతిష్టాత్మక మెన్స్ టీ20 వరల్డ్ కప్‌లో బౌలర్లు హ్యాట్రిక్ తీయడం అరుదుగా జరుగుతుంటుంది. అలాంటి రికార్డును యూఏఈ స్పిన్నర్ కార్తీక్ మెయ్యప్పన్ సాధించాడు. శ్రీలంకతో యూఏఈకి జరిగిన మ్యాచ్‌లో హ్యాట్రిక్ తీసి… వరల్డ్ కప్‌లో హ్యాట్రిక్ సాధించిన వారి జాబితాలో చేరాడు. టీ20 ప్రపంచకప్‌లో భాగంగా ఈ రోజు శ్రీలంక , యూఏఈ మధ్య క్వాలిఫైయింగ్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో యూఏఈ స్పిన్నర్ కార్తీక్ మెయ్యప్పన్ సంచలనం సృష్టించాడు. ఇరుజట్ల మధ్య జరిగిన ఈ మ్యాచ్‌లో శ్రీలంక మొదట బ్యాటింగ్ చేయగా , 15వ ఓవర్లో మెయ్యప్పన్ హ్యాట్రిక్ వికెట్లు తీశాడు. 4 ,5, 6 బంతుల్లో వరుసగా రాజపక్సా , అసలంక , శనకాను అవుట్ చేశాడు. మొత్తం 4 ఓవర్ల బౌలింగ్ వేసిన కార్తీక్…19 పరుగులు ఇచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. ప్రస్తుత డబ్యూసీ లో ఇదే తొలి హ్యాట్రిక్ కావడంతో కార్తిక్ పేరు మార్మోగుతోంది.

