NewsNews AlertTelangana

టీఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేస్తోందన్న కిషన్ రెడ్డి

Share with

జాతీయ విపత్తుల నిర్వహణ కింద తెలంగాణా రాష్ట్రానికి కేంద్రం మూడువేల కోట్లు నిధులు విడుదల చేసిందని, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. తెలంగాణా ప్రభుత్వం కేంద్రంపై అసత్య ప్రచారాలు చేస్తోందని, ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందని మండిపడ్డారు. 2018 నుండి విపత్తు సహాయనిధికి 1500 కోట్లు కేంద్రం ఇచ్చిందని తెలిపారు. 2020-21 లోకూడా హైదరాబాద్‌కు వరదలు వచ్చినప్పుడు రాష్ట్ర విపత్తు సహాయనిధికి 499 కోట్లు కేంద్రం మంజూరు చేసిందని కిషన్‌రెడ్డి వెల్లడించారు. 2సార్లుగా 224 కోట్ల చొప్పున ఇచ్చిందని అన్నారు. 2021లో రాష్ట్ర విపత్తుల ప్రతిస్పందన నిధికి కేంద్రం వాటా 359 కోట్లు అని చెప్పారు. ఇంత సహాయం చేస్తున్నా కేంద్రం సహాయం అందిచట్లేదని టీఆర్‌ఎస్ తప్పుడు ప్రచారాలు చేస్తోందని, వారిని నమ్మొద్దు అని అన్నారు. తాను ఋజువులతో కేంద్రం విపత్తుల నిర్వహణ కింద తెలంగాణా రాష్ట్రానికి ఇచ్చిన సహాయాన్ని నిరూపిస్తానని అన్నారు కిషన్‌రెడ్డి.