వైసీపీ నుండి బీజేపీకి జంప్…
ఏపీలోని వైసీపీ పార్టీకి మరో షాక్ తగిలింది. ఇప్పటికే కొందరు పార్టీని విడిచిపెట్టి టీడీపీ, జనసేనలలో చేరిపోయారు. తాజాగా వైసీపీ మండలి డిప్యూటీ చైర్మన్ పదవికి, ఎమ్మెల్సీ పదవికి ఒకేసారి రాజీనామా చేశారు జకియా ఖానుం. అన్నమయ్య జిల్లా రాయచోటి నియోజక వర్గం నుండి ఎమ్మెల్సీగా అప్పటి ముఖ్యమంత్రి జగన్ సిఫార్సుతో గవర్నర్ 2020లో ఆమెను మండలి చైర్మన్‌గా రికమెండ్ చేశారు. ఆమె కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జనసేన నేత జగన్‌ను, టీడీపీ నేత లోకేష్‌ను కలవడం కూడా సంచలనగా మారింది. గత కొద్ది కాలంగా వైసీపీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న జకియా ఖానుం తాజాగా పదవులకు రాజీనామా చేసి, బీజేపీలో చేరారు. రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి సమక్షంలో బీజేపీ కండువా కప్పుకున్నారు. ప్రధాని మోదీ సిద్ధాంతాలు నచ్చి బీజేపీలో చేరానని ఆమె చెప్తున్నారు.


 
							 
							