బన్నీ బెయిల్ పిటిషన్ పై జనవరి 3న జడ్జ్ మెంట్
సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట కేసులో సినీ హీరో అల్లు అర్జున్ రెగ్యులర్ బెయిల్ పిటిషన్ పై తీర్పును జనవరి 3 న నాంపల్లి కోర్టు వెల్లడించనుంది. ఇవాళ న్యాయస్థానంలో పోలీసుల తరఫున పీపీ, బన్నీ తరఫున సీనియర్ కౌన్సిల్ నిరంజన్ రెడ్డి వాదనలు వినిపించారు. బన్నీకి రెగ్యులర్ బెయిల్ ఇవ్వొద్దంటూ చిక్కడపల్లి పోలీసులు కౌంటర్ దాఖలు చేశారు. బెయిల్ పిటిషన్ కొట్టివేయాలని పబ్లిక్ ప్రాసిక్యూటర్ కోర్టును కోరారు. ఈ క్రమంలోనే ఇరువైపులా వాదనలు విన్న న్యాయస్థానం తీర్పును జనవరి 3వ తేదీకి వాయిదా వేసింది.


 
							 
							