తెలంగాణ గవర్నర్ గా ప్రమాణస్వీకారం చేసిన జిష్ణుదేవ్ వర్మ
రాజ్ భవన్ లో తెలంగాణ గవర్నర్ గా జిష్ణుదేవ్ వర్మ తో ప్రమాణ స్వీకారం చేయించారు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ ఆరాధే. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, రాష్ట్ర మంత్రులు,ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ లు, ఉన్నతాధికారులు హాజరయ్యారు.


