NewsTelangana

 మీకు నేనున్నా .. అంటున్న గవర్నర్ తమిళిసై

Share with

ఈ మధ్య కాలంలో రాష్ట్రంలో  మహిళలపై ఎన్నో అఘాయిత్యాలు జరుగుతున్నాయి. వీటిని ఆరికట్టే నేపథ్యంలో భాగంగా అలాగే రాష్ట్రంలో ఉన్న మహిళలకు మద్దత్తు ఇవ్వడం కోసం తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై ఒక వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.ఈ కార్యక్రమంలో భాగంగా రాష్ట్రంలో ఉన్న మహిళలకు ఏ సమస్యలు ఉన్నా తన దృష్టికి తీసుకురావాలని గవర్నర్ మహిళలకు సూచించారు. అమ్మలా అండగా ఉంటానని వారికి కొండంత భరోసా అందించారు. తాను కొన్ని స్వచ్చంధ సంస్థలతో కలిసి హెల్త్,ఎడ్యుకేషన్‌కు ఆర్థిక సాయం చేస్తున్నానని తెలిపారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ ‌కు చెందిన ఇద్దరు మహిళలకు ,సూర్యాపేటకు చెందిన మరో మహిళకు 25,000/- చొప్పున ఆర్థిక సాయాన్ని అందించారు. సోమవారం రాజ్ భవన్‌లో మహిళ దర్బార్ ఫాలో అప్ ప్రోగ్రాంను గవర్నర్ తమిళిసై ఆధ్వర్యంలో నిర్వహించారు.ఈ కార్యక్రమానికి జాతీయ మహిళ కమిషన్ చైర్ పర్సన్ రేఖా శర్మ కూడా హాజరయ్యారు.ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ గత నెలలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో దాదాపు 400 వందల ఫిర్యాదులు వచ్చాయని తెలిపారు. అయితే  వాటిని కేటగిరీల వారీగా విభజించగా అందులో 41 లీగల్‌వని… వారినందరినీ రాజ్ భవన్‌కు రావాలని సూచించగా కేవలం 27 మంది మాత్రమే హాజరయ్యారని తెలిపారు. వారందరీ కోసం అడ్వొకేట్లను నియమించామన్నారు. అయితే వారి హెల్త్ సమస్యలకు సంభందించి ఈఎస్ఐ, కొన్ని ప్రైవేటు ఆస్పత్రులకు రిఫర్ చేశామన్నారు. ప్రభుత్వం పరిష్కరించాల్సిన కొన్ని సమస్యలను ఆయా శాఖలకు పంపించామన్నారు. కాంట్రవర్సీల కోసం కాకుండా మహిళలకు మద్దతు అందించాలనే ఉద్దేశ్యంతో… మానవతా దృక్పథంతోనే ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామన్నారు. “రాజ్‌భవన్‌కు వస్తే మీ సమమ్య పరిష్కారం అయినట్లేనని..ధైర్యంగా వెళ్ళండని”ఈ  కార్యక్రమానికి హాజరయిన మహిళలకు గవర్నర్ తమిళిసై భరోసా ఇచ్చారు.