ఏపీ కొత్త సీఎస్‌గా జవహర్ రెడ్డి
ఏపీ కొత్త సీఎస్‌గా జవహర్ రెడ్డిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. డిసెంబర్ 1 నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా జవహర్ రెడ్డి బాధ్యతలు చేపడతారు. 2024 జూన్ వరకు ఆయనకు సర్వీసులో ఉంటారు. ఏడాదిన్నరపాటు సీఎస్‌గా జవహర్ రెడ్డి కొనసాగనున్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికలు పూర్తయ్యే వరకు ఏపీ సీఎస్‌గా జవహర్ రెడ్డి కొనసాగే అవకాశం ఉంది. ప్రస్తుతం జవహర్ రెడ్డి సీఎంకు ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా విధులు నిర్వర్తిస్తున్నారు. 1990 బ్యాచ్ ఐఏఎస్ అధికారి. జవహర్ రెడ్డి కంటే సీనియర్లయిన నీరభ కుమార్ ప్రసాద్, పూనం మాలకొండయ్య, కరికాల్ వలెవన్, సీఎస్ ఆశావహుల్లో ఉన్నారు. అయితే వారందరినీ కాదని.. జగన్, జవహర్ రెడ్డిపై మొగ్గుచూపారు. వైఎస్ జగన్ సీఎం అయ్యాక జవహర్ రెడ్డి కీలక పోస్టుల్లో బాధ్యతలు నిర్వర్తించారు. టీటీడీ ఈవోగానూ జవహర్ రెడ్డి పనిచేశారు. అక్కడ పనిచేస్తున్న సమయంలోనే సీఎంఓ విధులు నిర్వర్తించారు. ప్రధాన కార్యదర్శిగా పదవీ విరమణ చేస్తున్న సమీర్ శర్మను కాలుష్య నియంత్రణ మండలి ఛైర్మన్‌గా నియమించనున్నట్టు తెలుస్తోంది.

