డబ్బు కోసం యుద్ధం చేస్తున్నా…
గత కొన్నిరోజులుగా కురిసిన కుంభవృష్టిల వల్ల నష్టపోయిన ప్రజలకు ఏపీ సీఎం జగన్ భరోసా కల్పించారు. సెప్టెంబరు నెలలోపు పోలవరం నిర్వాసితులకు పరిహారం చెల్లిస్తామని హామీ ఇచ్చారు. వారికి డబ్బు ముట్టాకే పోలవరం పాజెక్టులో నీళ్లు నింపుతామని, ఎవరికీ అన్యాయం జరగనీయమని అన్నారు. దానికోసమే కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతున్నామని, పోలవరం ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ కోసం అడుగుతున్నామని అన్నారు. నాలుగు ముంపు మండలాలను ప్రత్యేక డివిజన్‌గా చేసేందుకు ఒప్పుకున్నారని అన్నారు. పోలవరం ప్రాజెక్టు కట్టినా నీరు ఒకేసారి నింపమని పూర్తిగా నింపితే ప్రమాదం సంభవించవచ్చని అన్నారు. కేంద్ర జలసంఘం సూచనల ప్రకారం సగం వరకూ ముందు నింపి, తర్వాత మూడేళ్లలో పూర్తిగా నింపుతామని ఏ ఒక్కరికీ ముంపు వల్ల నష్టం జరగకుండా చూస్తామని అన్నారు. ఈ ప్రాజెక్టుకు రాష్ట్రం తరపున 20 వేలకోట్లు అయ్యిందని, ఆ డబ్బు కేంద్రం నుండి రావాలని నిధుల కోసం పోరాటాలు చేస్తూనే ఉన్నామని, అర్థిస్తూనే అడుగుతున్నామని జగన్ తెలిపారు.