NationalNews

ఎన్డీయే ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా బెంగాల్ గవర్నర్ జగదీప్ దనకర్

Share with

ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా అనూహ్యంగా తెరపైకి బెంగాల్ గవర్నర్ జగదీప్ ధన్కర్ వచ్చారు. ఈ సాయంత్రం వరకు ఉపరాష్ట్రపతిగా ముక్తార్ అబ్బాస్ నఖ్వీ ఉన్నారని అందరూ భావించారు. కానీ బీజేపీ పెద్దలు ధన్కర్ కి అవకాశం ఇచ్చారు. కొద్దిసేపటి క్రితం బీజేపీ పార్లమెంటరీ బోర్డు ఈ నిర్ణయం తీసుకుంది.

2003 లో బిజెపిలో చేరిన జగదీప్ ధన్కర్ ప్రస్తుతం పశ్చిమ బెంగాల్ గవర్నర్ గా ఉన్నారు. వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన జగదీప్ ధన్కర్ సుప్రీం కోర్టు న్యాయవాదిగా సమర్థవంతంగా పనిచేశారని మంచి పేరుంది. 1989లో జనతాదల్ నుంచి ఆయన ఎంపీగా గెలుపొందారు.