విజయసాయిరెడ్డికి, చంద్రబాబుతో బంధుత్వమట
వైసీపీ నేత విజయసాయిరెడ్డి యటకారాలకు అడ్డూ అదుపూ లేకుండా పోతోంది. ప్రతిపక్ష నేత చంద్రబాబుపై ఇష్టానుసారం మాట్లాడుతూ రెచ్చిపోతున్న విజయసాయి… మరింత దాడి పెంచారు. నెల రోజులుగా టీడీపీ పనికిమాలిన చర్చలు పెడుతోందని… ఆడాన్ అనే కంపెనీ… విజయసాయిరెడ్డి ఫ్యామిలీదంటూ దుష్ప్రచారం చేస్తోందని విమర్శించారు. ఒకే అబద్దం మళ్లీ మళ్లీ చెప్తే నిజమై పోదన్నారు. కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్లు చంద్రబాబు, లోకేష్ వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. మాటలు మీరితే ఊరుకోమన్నారు. శ్రీనివాస్ అనే వ్యక్తి విజయసాయిరెడ్డి అల్లుడు కంపెనీకి చెందిన వాడని చంద్రబాబు, లోకేష్ ఆరోపించడం దారుణమన్నారు. శ్రీనివాస్ వేరే కంపెనీల్లో కూడా డైరెక్టర్ గా ఉన్నారని… అయినంత మాత్రాన మాకు సంబంధం ఉన్నట్లా అని ప్రశ్నించారు.
విదాన్ అటో వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్‌కి చెందిన వడ్లమూడి నాగరాజు అనే వ్యక్తికి కియా మోటార్స్‌ను చంద్రబాబు ఇచ్చారన్నారు. . అయితే ఇదే నాగరాజు హెరిటేజ్ కంపెనీల్లో డైరెక్టర్ గా కూడా ఉన్నాడన్నారు. మరి దీనికేం సమాధానం చెబుతారన్నారు చంద్రబాబు. నంద్యాల విష్ణురాజు హెరిటేజ్, అమరరాజా బ్యాటరీస్ లోనూ డైరెక్టర్‌గా ఉన్నారన్నారు. మరి అమరరాజ చంద్రబాబుదే అని నేను అనొచ్చంటారో లేదో చెప్పాలన్నారు విజయసాయిరెడ్డి. ఇంకా లివ్ లైఫ్ హాస్పిటల్స్, ఎక్సెల్ కంపెనీల్లో హెరిటేజ్ కంపనీలో కామన్ డైరెక్టర్స్ ఉన్నారు . మరి అవన్నీచంద్రబాబువి కావా అని ప్రశ్నించారు విజయసాయిరెడ్డి. దివీస్ సంస్థ వ్యక్తులు నాకు క్లోజ్ ఫ్రెండ్స్, అలాగే నారా ఫ్యామిలీకి కూడా సంబందీకులే. అలాగని దివీస్ నాది అయిపోతుందా ఏంటన్నారు.
రాజకీయంగా ఎదుర్కోలేక ,లేని పోని ఆరోపణలు చేస్తున్నారని, హద్దులు మీరొద్దని చంద్రబాబుపై విరుచుకుపడ్డారు విజసాయిరెడ్డి. అడాన్ కంపెనీ 3 శాతం మాత్రమే పంపిణీ చేస్తోందని, దుష్ప్రచారాలు చెయ్యెదని వేలకోట్లు ఎగ్గొట్టిన కార్వీ ప్రమోటర్లు చంద్రబాబు భాగస్వామ్యులే అని నేనంటే ఎలా ఉంటుందన్నారు. మీ కంపెనీలో డైరెక్టర్‌గా ముత్తురాజు విజయకుమార్ సత్యం కంపెనీలో కూడా డైరెక్టర్‌గా ఉన్నారు కదా…. నా బందువుల కంపెనీలు అన్నీ నావే అయితే హెరిటేజ్ కూడా నాదే చంద్రబాబు కూడా నాకు బంధువే అవుతాడన్నారు. అప్పుడు ఆ ఆస్తులన్నీ నావి అయిపోతాయా అన్నారు విజయసాయిరెడ్డి. నారా బ్రాహ్మణి 16 కంపెనీల్లో, భువనేశ్వరీ 14 కంపెనీల్లో డైరెక్టర్‌గా ఉన్నారని… క్రూయిజ్ కంపెనీ ఓనర్ షిప్ విజయసాయిదని చెప్పడం దారుణమన్నారు. నిజంగా కంపెనీ మాదైతే రాసిచ్చేస్తామంటూ చంద్రబాబుకు ఉల్టా ఆఫర్ ఇచ్చారు సాయిరెడ్డి.