హర్యానా ఫలితాలపై జగన్ కీలక వ్యాఖ్యలు
హర్యానా ఎన్నికల ఫలితాలపై ప్రజలు గందర గోళానికి గురవుతున్నారని వైసీపీ నేత జగన్ పేర్కొన్నారు. ఈ ఘటన ఏపీ ఎన్నికల ఫలితంలాగే ఉందన్నారు. ఏపీలో కూడా ఎన్నికల ఫలితాలపై ప్రజలు అయోమయంలో ఉన్నారన్నారు. అందుకే ఎన్నికలలో పేపర్ బ్యాలెట్ అంశంపై మరోసారి ఎన్నికల కమిషన్ ఆలోచించాలని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రజలలో విశ్వాసం నింపేందుకు చట్టసభ సభ్యులు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఈ విషయంగా తన ఎక్స్ ఖాతాలో పోస్టు చేశారు. అభివృద్ధి చెందిన ఆస్ట్రేలియా, అమెరికా, యూకే, కెనడా వంటి దేశాలు కూడా పేపర్ బ్యాలెట్‌ను ఉపయోగిస్తున్నాయని పేర్కొన్నారు..

