NewsTelangana

భూ..వివాదంలో దగ్గుబాటి ఫ్యామిలీ..

Share with

సమాజంలోనూ, ఇండస్ట్రీలోనూ  ఎంతో పేరు ప్రఖ్యాతలు, పలుకుబడి  ఉన్న దగ్గుబాటి కుంటుంబం ఈ మధ్యకాలంలో ఓ భూ వివాదంలో చిక్కుకుంది. ఈ మేరకు సిటీ సివిల్ కోర్టులో ఓ బాధితుడు సురేష్ బాబుపై పిటిషన్ దాఖలు చేశాడు. తనకు అమ్మిన భూమిని సురేష్‌బాబు … కొడుకు రానా పేరు మీద రిజిస్ట్రేషన్ చేశాడంటూ ఆరోపించాడు. అంతేకాకుండా తనతో పాటు మరొకరికి కూడా అగ్రిమెంట్ చేసి చీట్ చేశాడని ఆరోపించాడు. సురేష్ బాబు కోర్టు ఆదేశాలను సైతం లెక్క చేయకుండా రిజిస్ట్రేషన్ చేశారన్నాడు. హీరో వెంకటేష్ సైతం  తన పేరు మీద ఉన్న1200 గజాల భూమి లీజ్ అగ్రిమెంట్ ఉందన్నారని ఆరోపించాడు. దగ్గుబాటి కుటుంబం బలవంతంగా ఖాళీ చేయించే ప్రయత్నం చేస్తుందని ఆవేదన వ్యక్తం చేశాడు. సొసైటి నామ్సకు విరుద్ధంగా సురేష్ బాబు ప్లాట్లు కలిగి ఉన్నారన్నాడు. వారికున్న పరపతిని ఉపయోగించి పలు రకాలుగా వేధిస్తున్నారని, పలువురు ఉన్నతాధికారులు, రాజకీయ నేతలతో గతంలో బెదిరింపులకు దిగారని విమర్శించాడు. అదే విధంగా తనకు ఏం జరిగిన సురేష్ బాబుదే బాధ్యత అని… న్యాయపోరాటం కొనసాగిస్తానన్నాడు. ఈ కేసు విచారణ నిమిత్తం రానా ఈ రోజు కోర్టు విచారణకు హాజరు కావాల్సి ఉంది. అయితే రానా గైర్హాజరు కావడంతో కోర్టు విచారణను వచ్చే నెల 8 కి వాయిదా వేసింది.