Andhra PradeshHome Page SliderNews Alert

జగన్‌ పుట్టినరోజు సంబరాలు.. 600 కిలోల భారీ కేక్‌ను కట్‌ చేసిన ఫ్యాన్స్‌

ఏపీ సీఎం జగన్మోహన్‌ రెడ్డి పుట్టినరోజు సంబరాలు అప్పుడే మిన్నంటుతున్నాయి. ఇప్పటికే రేపు జరిగే జగన్‌ పుట్టిన రోజు వేడుకలకు భారీ ఏర్పాట్లు సాగుతుండగా.. ఆ లోపే రాష్ట్రంలో పలు చోట్ల వైసీపీ అభిమానులు జగన్‌ బర్త్‌ డే సంబరాలు మొదలుపెట్టేశారు. ఇందులో భాగంగా ఇవాళ విజయవాడలోని గొల్లపూడి ప్రాంతంలో 600 కేజీల భారీ కేక్‌ను వైసీపీ నేతలు కట్‌ చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, పార్టీ నేతలు, అభిమానులు పాల్గొన్నారు.

గొల్లపూడి వేదికగా జనం గుండెల్లో నిలిచిన అభిమాన నేత మన సీఎం జగనన్న జన్మదిన వేడుకలను వైఎస్సార్ కుటుంబ సభ్యులు ఓ జాతరలా జరుపుకుంటున్నారని మంత్రి మేరుగ నాగార్జున ఈ సందర్భంగా పేర్కొన్నారు. కార్యక్రమానికి భారీ స్థాయిలో పార్టీ శ్రేణులు హాజరు కావడంతో జై జగన్ అనే నినాదాలతో గొల్లపూడి ప్రాంతం మార్మోగింది. మైలవరం నియోజకవర్గం, విజయవాడ రూరల్ మండలంలోని గొల్లపూడిలో సచివాలయం-1 ఎదురుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.