జగన్ రెడ్డీ! నిన్ను ఓడించటానికి ప్రజలు “సిద్ధం”-చంద్రబాబు వ్యాఖ్యలు
జగన్ పని అయిపోయింది.. జగన్ కి కౌంట్ డౌన్ మొదలైందన్నారు టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు. మీరు చేసిన రౌడీయిజం, మీరు చేసిన అరాచకాలు గుర్తు తెచ్చుకుంటే రక్తం మరుగుతోందన్నారు. పీలేరులో నిర్వహించిన సభ సూపర్ హిట్ అయ్యింది. లక్షలాది మంది జయజయధ్వానాల మధ్య చంద్రబాబు ప్రసంగించారు. రా.. కదలిరా పేరుతో జరిగిన బహిరంగ సభల్లో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిపై తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు విమర్శలు గుప్పించారు. అధికార వైసీపీ ఆంధ్రప్రదేశ్ ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తోందని ఆరోపించారు. అవినీతి సొమ్ముతో ఎన్నికల ప్రచారానికి సిద్ధమవుతున్నారని ఇటీవల పీలేరులో జరిగిన సభలో ‘సిద్ధం’ సభను ప్రస్తావించారు.

పీలేరు జనసునామీ ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆకాంక్షలకు నిదర్శనంగా నిలిచిందన్నారు. జనసంద్రాన్ని చూసి ఉప్పొంగిన చంద్రన్న రాష్ట్ర భవిష్యత్తుకి భరోసా ఇచ్చారు. జనాలని తోలుకొస్తే, నీ మీటింగుల్లాగా ఎప్పుడు పారిపోదామా అని చూస్తూ ఉంటారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు గారు మీటింగ్ పెడితే, ఇలా ఉత్సాహంగా ఉరకలు వేస్తారన్నారు. నీ జన్మలో, ఇలాంటి ఆదరణ చూసి ఉండవన్నారు. ఉరవకొండలో నారా చంద్రబాబు నాయుడు గారి ‘రా… కదలిరా!’ బహిరంగ సభకు భారీ ఎత్తున ప్రజలు తరిలివచ్చారు.

జగన్‌ను, ఆయన పార్టీని ఓడించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని చంద్రబాబు పేర్కొన్నారు. జగన్‌కు సరైన అభ్యర్థులు దొరకడం లేదని, యువత, రైతులు, ప్రభుత్వ ఉద్యోగులు జగన్‌ను అధికారం నుంచి దించి టీడీపీని తీసుకురావాలని కృతనిశ్చయంతో ఉన్నారని ఆరోపించారు. యుద్ధం ప్రారంభమైందని, తమ మిత్రపక్షమైన జనసేన పార్టీతో కలిసి “కురుక్షేత్ర ధర్మ యుద్ధానికి” సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. అభివృద్ధి, ప్రాజెక్టులు, పరిశ్రమల విషయంలో జగన్ విఫలమయ్యారని, ఆయన పాలనలో ఈ రంగాల్లో చెప్పుకోదగ్గ పురోగతి లేదని విమర్శించారు.

ఆంధ్ర ప్రదేశ్‌లోని రాయలసీమ ప్రాంతాన్ని సంపన్న ప్రాంతంగా మార్చేందుకు తాను కృషి చేశానని పేర్కొంటూ ఆ ప్రాంత అభివృద్ధికి నిబద్ధత ఉందని చంద్రబాబు చెప్పారు. హంద్రీనీవా, గాలేరు నగరి వంటి పథకాలకు నిధుల కేటాయింపును ప్రస్తావించిన ఆయన, ఈ కార్యక్రమాలకు జగన్ నిధులు ఇవ్వకపోవడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. నాయుడు బహిరంగ సభలు జగన్ పాలన వైఫల్యాలను ఎత్తిచూపడంతోపాటు… టీడీపీకి ఓటేయాల్సిన ఆవశ్యకతను చంద్రబాబు వివరించారు.


 
							 
							