మల్కాజ్‌గిరి ఎంపీగా ఈటలరాజేందర్ పోటీ
తాను మల్కాజ్‌గిరి ఎంపీగా బీజేపీ తరపున పోటీ చేయబోతున్నట్లు ప్రకటించారు బీజేపీ నేత ఈటల రాజేందర్. తాను కాంగ్రెస్ పార్టీలోకి చేరతానంటూ వస్తున్న వార్తలు అవాస్తవమని, కావాలనే కాంగ్రెస్ పార్టీ వారు ఇలా ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. లేదా తనంటే గిట్టని బీజేపీ పార్టీలోని వారే ఇలాంటి వార్తలు చెప్తుండవచ్చన్నారు. తాను బీజేపీలోనే ఉంటానని, మోదీ నాయకత్వంపై తనకు నమ్మకముందని పేర్కొన్నారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికలలో పోటీ చేస్తున్నానని, మల్కాజ్‌గిరి నియోజక వర్గం నుండి ఎంపీగా పోటీ చేస్తానని ప్రకటించారు. పల్లెటూర్ల నుండి సిటీల వరకూ ప్రజలు పార్లమెంట్ ఎన్నికలపై చాలా క్లారిటీతో ఉన్నారని, బీజేపీని పార్లమెంటులో గెలిపిస్తారని, మళ్లీ మోదీయే ప్రధాని అవుతారని ధీమా వ్యక్తం చేశారు.

