Home Page SliderTelangana

అత్యాచారం చేసింది నిజమే..ఒప్పుకున్న జానీ మాస్టర్..

జానీ మాస్టర్ రిమాండ్ రిపోర్టులో కీలక విషయాలు బయటపడ్డాయి. తాను 16 ఏళ్ల వయసున్న అసిస్టెంట్ మహిళా కొరియోగ్రాఫర్‌పై అత్యాచారం చేసింది నిజమే అని అంగీకరించారు జానీమాస్టర్. నాలుగేళ్లుగా పలుమార్లు ఆమెపై అత్యాచారానికి పాల్పడినట్లు పేర్కొన్నారు. 2019లో ఆమెను అసిస్టెంటుగా చేర్చుకున్నానని, 2020లో ముంబయిలోని హోటల్‌లో ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డానని ఒప్పుకున్నట్లు తెలిపారు పోలీసులు. అతడి భార్య ఆయేషా కూడా ఆమెను బెదిరించినట్లు తెలిసిందన్నారు.