అక్కడ 400 శాతం జీతాలు పెంచిన ప్రభుత్వం
దశాబ్ధాలుగా కష్టాలు పడుతున్న సిరియా ప్రజలు ఇప్పుడు స్వేచ్ఛావాయువులు పీల్చుకుంటున్నారు. దేశాధ్యక్షుడు నియంత బషర్ అల్ అసద్ రష్యాకు పారిపోవడంతో తిరుగుబాటుదారులు ప్రభుత్వం ఏర్పాటు చేశారు. కొత్త ప్రభుత్వంలో ఉద్యోగులకు 400 శాతం జీతాలు పెంచుతామని సిరియా ఆర్థిక మంత్రి మహ్మద్ అబ్జాద్ ప్రకటించారు. దేశ వనరుల నుండి 1.65 ట్రిలియన్ సిరియన్ పౌండ్లు సమీకరిస్తామని పేర్కొన్నారు. నూతన ప్రభుత్వానికి ఆర్థిక సహాయం చేస్తామని అరబ్ దేశాలు హామీ ఇచ్చాయని తెలిపారు. విదేశాలలోని సిరియాకు చెందిన ఆస్తులను విడిపించే ప్రయత్నాలు చేస్తామన్నారు.

